దుమ్ము అపాయకరమైన దని, ఎందుకు పనికి రాదని సాధారణంగా మనం అనుకుంటాం
కానీ ఇది నిజం కాదు. దుమ్ము లోని తేమతోకూడిన దమ్ము దాని కణాల
నిమ్ముతో వాతావరణంలో తేలియాడుతూ ప్రభావం చూపుతుంది. అసలు ఈ ధూళి దుమ్ము ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అన్నది కూడా మనం తెలుసుకుందాం.
ఘణ రూపంలో ఉన్న ప్రతి వస్తువు
అనేక కోట్ల సూక్ష్మ కణాలతో కూర్చబడి ఉంటుంది. ఈ కణములు విడిపోయినప్పుడు డు సన్నని పొడి రూపంలో ఏర్పడతాయి. ఆ పొడిని మనం దుమ్ము లేక దూళి అంటాము.
ఘన పదార్ధములను చిన్న చిన్న ముక్కలుగా చేసి నప్పుడు డు మెత్తటి పొడి మిగులుతుంది.
ఈ సూక్ష్మమైన కణము లే గాలిలోకి ఎగిరిపోయి దుమ్ముగా మారుతుంది.గాలి ఈ కణములను ఒకచోటి నుండి మరొకచోటికి ఎగరేసుకుని తీసుకువెళుతుంది.
ఈ దుమ్ము ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఘనపదార్థాలు విచ్ఛిన్నమైనప్పుడు దుమ్ము పుడుతుంది. ఇలాగే బొగ్గు, కట్టెలు, పెట్రోలు మొదలైన వాటిని కాల్చడం ద్వారా వచ్చే పొగ కూడా
ధూళిఏర్పడడానికి కారణం
అవుతుంది. ఈ పొగ లో కూడా బూడిద రూపంలో కణములు గాలిలోకి ఎగిరిపోతాయి.
జంతువుల మృత కళేబరాలు, ఎండిపోయిన చెట్లు, సముద్రపు ఉప్పు, ఎడారి లోని ఇసుక మొదలైన వాటి వలన కూడా
ధూళి కణములు ఏర్పడతాయి.
భూమి మీద ఉండే కణములు కూడా గాలికి ఎగిరి దూళిగా మారుతాయి.
ఈ ధూళి తో బాటు ఎగిరే కణముల వలన మనకు కలిగే ముఖ్యమైన ఉపయోగములలో
వర్షాలకు సంబంధించిన ది మొదటిది. మేఘాలలో ఉండే నీటి ఆవిరిలో, గాలి తో బాటు ఉ ఈ ధూళి కణములు కలవడం ద్వారా నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ కణాల పై నీటి ఆవిరి నీటి రూపంలో ఏకత్రితమైన,వాన రూపంగా భూమిపై కురుస్తుంది.
ఆధునిక రాలే లేకుంటే, నీతి ఆవిరి రూపంలో ఉండే మేఘాల నుండి నీటి బిందువులు ఏర్పడడం క్లిష్టమౌతుంది. పొగమంచు కూడా ధూళి వలన ఏర్పడుతుంది.
వాయు మండలంలో ఉన్న సూర్య కిరణములను నలువైపుల కు ప్రతిఫలింప చేస్తాయి. సూర్యాస్తమయం అయిన పిదప దాదాపు 1,2గంటల వరకు వెలుగు ఉండడానికి ఒక్కసారిగా చీకటి పడక పోవడానికి ఈ కణం లే కారణం. సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లో సూర్యుడు ఎర్రగా కనబడడానికి గణములు, నీటి ఆవిరి కారణము. సాయంత్రం
గోధూళి వేళలో సూర్య కిరణాలు ఎర్రగా రమణీయంగా, ఎంతో సుందరంగా కనబడడానికి ఈ దుమ్ము కాలములో ముఖ్య కారణం. మనం ఏ దుమ్మునైతే ఎందుకు పనికి రాదని, అసలు ఈ దుమ్ము ఈ భూమిపై లేకుంటే ఎంత బాగుంటుందో అని మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం.
కాని దుమ్ము లోని తేమతో కూడిన
దమ్ము,అంటే శక్తి,ఆశక్తే మనకు
అత్యంత ఉపయోగకరం అని మీకు
ఇప్పుడు తెలిసిందిగా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి