మమ్మీ తేనే తిన్ను, దాడి తేనే తిన్ను, అంటూ మేమంతా తినేదాకా వదిలేది కాదు. దాని నానమ్మ"ఎందుకు ఏం పిల్లవే నువ్వు" తేనే పిల్ల వై పోయావు అంటూ దాన్ని మెచ్చుకునే ది.
ఓ హనీ హనీ హనీ
నేనే చెప్పనా కహానీ
ఉండే నొక్క కాకి అంట
దాహమేసి పడెను తంట.
ఈ బాల గీతం అలవాట్ల ఆకతాయి
మా మనవరాలు హనీ పై వ్రాసింది.
ఇదొక్కటే కాదండోయ్, అది చేసే ఆ కతాయి పనులపై సుమారు యాభై దాకా వ్రాసాను. వాటన్నింటికి మా హని చిలిపి చేష్టలే ప్రేరణ. అసలు దానికి పెట్టిన పేరు స్రవంతి కానీ ఈ పేరును మేమంతా మరిచిపోయే టట్లుగా చేసేది. మా ఇంట్లో అందరికి ప్రతి ఉదయం తేనెను నీటిలో కలుపుకొని త్రాగడం అలవాటు. ఆ అలవాటు ప్రకారం గా ఒక రోజు మా స్రవంతి నాయనమ్మ నీటిలో తేనె కలుపుతుంది. అప్పుడు అది"నానీ
ఇది ఏంది ? అని వచ్చిరాని
మాటలతో అడగ్గా,నాని తేనె అంటూ చెప్పి దాని నోటికి తేనె నాకిచ్చింది. అంతే అప్పటి నుంచి ప్రతి రోజు దాని నానమ్మ తో అది
"తేనె నేని నాని అంటూ అల్లరి చేసేది. తేనే తినిపించే వరకు వదిలేది కాదు.తల్లిని,తండ్రిని సతాయించేది. మమ్మీ తేనే తిన్ను
దాడి తేనే తిన్ను, తాతి తేనె తిన్ను
అంటూ మేమంతా తినేదాకా వదిలేది కాదు. దాని నానమ్మ
"ఏం పిల్లవే నువ్వు తేనే పిల్ల వై పోయావు"అంటూ దాన్ని మెచ్చుకునేది. అలా ఈతేనే పిల్లనే
మేం"హాని"అని అప్పట్నుంచి పిలుచుకో సాగాము.
అంతేకాదండోయ్ అలవాట్ల అభ్యాసం లోనూ మమ్ముల నే కాక
ఇంటికి వచ్చి పోయే బంధువులనూ ఇబ్బందుల పాలు చేసి ఆట పట్టిస్తుంది. మా హాని ఓసారి దాని రెండవ జన్మదినోత్సవానికి దాని అమ్మమ్మ తాతయ్య, మామయ్యలు వచ్చారు. వారంతా భోంచేసిన తర్వాత అరటి పండ్లు ఇవ్వగా వారు తిని తొక్కలను బాల్కనీ లో నుండి రోడ్డు పైకి విసిరేశారు. అది చూచిన మాహని వెంటనే ఏడుపు లంకించుకుంది. అకస్మాత్తుగా ఏడ్చే టప్పటికి వారంతాఅంతా అవాక్కయి పోయారు. తల్లి, తండ్రి, నాయనమ్మ లోపలి గదిలో నుంచి
వచ్చి"ఎందుకు ఏడుస్తున్నావ్ ఏమయ్యింది"? అంటూ ప్రశ్నిస్తూ
బుజ్జగిస్తున్నారు. అయినా అది ఏడుపు ఆపలేదు. తాత నైన నేను
కూడా తికమక పడ్డాను. మా హనిని దగ్గరకు తీసుకొని"హని ఏమైంది? మామయ్య, తాతయ్య,
అమ్మమ్మ ఏమన్నా అన్నారా? చెప్పు"అనగా అది నేరుగా బాల్కనీ లోకి తీసుకెళ్లి వేలితో రోడ్డుపై వేసిన అరటి తొక్కలకేసి చూపించింది.
అప్పుడు అసలు విషయం మాకందరికీ అర్థమయ్యింది. వెంటనే నేను రోడ్డు పైకి వెళ్లి ఆ అరటి తొక్కలను తీసుకొచ్చి మా మనవరాలికి ఇచ్చాను. అది ఏడుపు ఆపి నేరుగా వాటిని తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసింది. తిరిగి నవ్వుకుంటూ వస్తూ అమ్మమ్మ, మామ, ఓక్ అంటూ చప్పట్లు కొట్ట సాగింది.
రోజు తిన్న తర్వాత అరటి తొక్కలను చెత్తబుట్టలో వేసే అలవాటు పై పొరపాటు జరిగింది.
చూశారుగా మా ఆకతాయి అలవాట్ల మాహనీ పని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి