మన తెలుగు భాష పండుగ:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్ నెం.9491387977.
వచ్చేస్తుంది మన తెలంగాణ తెలుగు భాష దివ్యమైన పండుగ
నచ్చేస్తుంది వచ్చేసిన విచ్చేసిన అతిథులకు మనసు నిండుగా

విశ్వమానవాళి యదవీణను 
తన కొనగోటితో మీటుకుంటు
అశ్వగమన వేగంతో మన దేశం
సరిహద్దును తాను దాటుకుంటు

దిగ్విజయంగా జరుగుతున్నమన
తెలంగాణ తెలుగు భాష సభలకు
అద్వితీయంగా వెలుగుతున్న నేటి
తెలుగుజాతి సాహితీదివ్యప్రభలకు

దేశ దేశ భాష ప్రియులంతా తమ
తమ చేతులెత్తి మొక్కుతారంట
ఆశ తీర ధ్యాస తోని కవులందరి
చిత్రాలను శిల్పులై చెక్కుతారంట


పారిజాత పరిమళాలసుగంధాలను
అమ్మదనం కమ్మదనం బంధాలను
కలగలిపి ఇల నిలిపిఅందిస్తున్నది
అందరి అందం తానై స్పందిస్తున్నది

అన్నమయ్య పాటలనుమధురంగా
రామదాసు కీర్తనలమనోహరంగా
వినిపిస్తూ వినోద పరుస్తూవస్తుంది
మస్తుగ అందర్ని ఔరా అనిపిస్తుంది

సమాసాల సంధులను అందిస్తు
వినోదాల విందులను సందిస్తు
వ్యాకరణ అంశాలను జతచేస్తు
స్వీకరణ సంశయాలను పూరిస్తూ

సౌందర్య గానకోకిల గాత్రంతో
గంధర్వ జానపదం సూత్రంతో
మాతృభూమి పై తా నర్తిస్తూ
మాతృదేవోభవ అని కీర్తిస్తూ

ఆగమేఘాలపై వస్తున్నది
మన తెలుగు భాష పండుగ
విశ్వమానవాళి యద నిండగ
అశ్వగమన వేగంతోమనకండగ


కామెంట్‌లు