జల సృష్టి కథేంటి.......?:--గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్ నెంబర్.9491387977.

 హలో ఫ్రెండ్స్!మన నిత్య జీవితమందు జలానికున్న ప్రాధాన్యత మనందరికి తెలిసిన విషయమే. అటువంటి జలం పుట్టుపూర్వోత్తరాలు మీకు తెలుసా!వేదమందు మాత్రం జలానికి"జన్మమని"అర్థం ఉందని మీకు తెలిసినచో మీరు చాలా ఆశ్చర్యపోతారు.జన్మశబ్దార్థముపుట్టుకయని మనకందరకు తెలిసినదే
ఆధునిక విజ్ఞాన శాస్త్ర జ్ఞులు ఆక్సిజన్+హైడ్రోజన్ అను రెండు వాయువుల యొక్క సంయోగము వలన జలము యొక్క జన్మోత్పత్తి
యునాని తెలిపినారు. వారి అభిప్రాయాన్ని బట్టి ఈ జల మునకు జన్మ మని వేదం తెలిపిన అర్థం సరి అయినదని రుజువవుతున్నది. అంతేకాదు నీరుకు "రేత"అని అర్థం గూడాఉన్నది. అమరాదికోశములందు నీరుకు అనేక అర్థములు గలవు. "మిత్రావరుణులు"అను ప్రకృతి పురుషులు నీరును సృష్టించినట్లు గా మనకు అధర్వణ వేదం తెలుపుచున్నది."మిత్రావరుణాత్రావృష్టిశ్చావతామ్"అను వచనము ద్వారా ఈ నిజం తేటతెల్లమయింది.అట్లే "మిత్రావరుణౌవృష్ట్యధిపతీతౌమావతామ్"అను వచనము ద్వారా వృష్ట్యధిపతులగు మిత్రావరుణులిద్దరు నీటి రక్షకులని తెలియ చున్నది ఈ రెంటి వచనముల ద్వారా సృష్టిలో ఆ మిత్ర వరుణ లను మనం ఈ నవీన యుగంలో మిత్ర వాయువును ఆంగ్లంలో హైడ్రోజన్ పేరుతోను, వరుణ వాయువును ఆక్సిజన్ పేరుతోను పిలుస్తున్నాము. ఈ రెండు వాయువులు కలిస్తేనే నీరు ఉత్పన్నమవుతుందని సైన్స్ ఫిక్షన్ లో ఆక్సిజన్+హైడ్రోజన్=నీరు అని మనందరకు తెలిసిన విషయమే. ఇక నీటి ప్రాశస్తం లోకి వెళితే నీరు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందో, అట్టి నీటి యందు అమృతం, ఔషధం గూడ ఉన్నాయని తెలియుచున్నది.
       మగ్రిఫిడ్ అను పాశ్చ్యాత్య పండితుడు ఋగ్వేద మంత్రం ద్వారానే జలమందు రోగ నివారణ గుణం ఉన్నదని తెలుసుకుని దేశమంతటా ప్రచారం చేసి ఉన్నాడు డు. రుగ్వేద మందు"అప్సుమేసోమో అబ్రవిత్,
అంతర్విశ్వని భేశజా,అగ్నించ విశ్వ
శంభువమ్,అపశ్చవిశ్వభేశజీ" అను
మరి యొక్క మంత్రము ద్వారా నీటి అంతరమున సమస్త ఔషధములు గెలవని, ఇట్లు అగ్నిచేత కారకుడయ్యాడో అట్లే నీరుకూడా ఔషధ రూపమై ఉన్నదని సోముడు అనుచక్రవర్తి తెలిపినాడని మగ్రిఫిద్ దీనిని భాషాంతరీకరించు కున్నాడని తెలుస్తున్నది." ఢిహారెల్" అను ఫ్రాన్స్ దేశ వైద్యుడు నీరు వల్ల మనకు సంభవించు గ్రహణి, టైఫాయిడ్, మొటిమలు, కురుపులు, వ్రణములు, విరేచనములు, చీము వ్యాధులు, ఎముకల వ్యాధులు, అంత్రవేష్ట వ్యాధులు మొదలగునవి నయమవుతాయని ప్రయోగాలు చేసి నిరూపించారు. తెలిసిందిగా బాలబాలికలూ ఈ నీటి కెంత కథాకమామీషు ఉందో ఇప్పటికైనా నా మీకు అర్థమైందని అనుకుంటా టాటా బాయ్ బాయ్ నాకు దాహమేస్తూంద మళ్ళీ కలుస్తా.

కామెంట్‌లు