ధనమునే ప్రేమించుమన్నా
దానమన్నది తుంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి బ్యాంకులో దాచిపెట్టోయ్ !
అప్పుల్లోళ్ళ వెంట తిరిగి తిరిగి
వడ్డీ కోసం నీవు పాటు పడవోయ్
నడ్డి విరిగి జబ్బు చేసిన అసలు
డబ్బుకు నీవు విసిగి పోకోయ్ !
డబ్బు ఎక్కువ నాకు ఉందని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూనిఒక గొప్ప బ్యాంకును నీవే
కట్టి అప్పులోళ్లకు చూపవోయ్!
సొంత లాభం కొంత పెంచి
పొరుగువారి దుంప తెంచోయ్
ధనం అంటే ఇంధనం కాదోయ్
అది అసలు వడ్డీ బంధమోయ్ !
వడ్డికై నీవు అణిగి మణిగి
అప్పులోళ్ళను దువ్వవలెనోయ్
నీదు మంచిని వారు యెంచి
మరల వడ్డికి వత్తురోయ్ !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి