కోపం--శాంతం.:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్,నెం.9491387977.
 కోపం మదిలో ప్రకోప రూపం చెంది
పొగలు సెగలు  గ్రక్కతుంది శాంతం
అది గ్రహించి సహనం వహిస్తుంది తన తన దారిని మార్చుకొని కోపం దహనం తట్టుకొని స్థిరంగా నిలుస్తుంది

కోపం ఉన్నచోట తానుండలే నంటూ క్షమాగుణ రాగం తీసుకుంటూ సురక్షితంగా తాను 
పక్కకు వెంటనే చెప్పుకుంటుంది
నిజం నీడలోనే నిలుస్తుంటుంది

కోపతాపాలు సహించి భరించడం

తనకేమి కొత్థకాదంటూ సుతిమెత్తగ
మందలిస్తూ మర్యాదగా తన దారికి రావాలంటూ కోపతాపాల 
పాపాలు మరిపోవాలంటూ మంచి
దారిని ఎంచుకొని శాంతి ప్రశాంతిగ
జీవించాలని ప్రబోధ శరాన్ని సంధిస్తుంది సందేశాన్ని అందిస్తుంది.

ఆలకించిన కోపం పాపం తన  ప్రకోపం పంథాను మార్చుకోవాలని
ఆలోచన పరిధిలో భ్రమిస్తూ తనకు
తెలియకుండానే పాలపొంగులా 
బుస్సున చల్లారు తుంది అంతటితో దాని బ్రతుకు తెల్లారు తుంది.

కామెంట్‌లు