కిడ్డీ బ్యాంక్ బుడతలం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి-సెలనెం,9491387977

మేం కిడ్డీ బ్యాంక్ స్థాపించిన చిరుతలం 
మా వడ్డీ ర్యాంక్ సాధించిన బుడతలం
 మేం బ్యాంక్ సేవలు అర్తించు వారలం 
మా ర్యాంక్ తోవలు గుర్తించు పోరలం

మా ప్రియమైన బ్యాంకర్లను కలుసుకుంటాం 
మేం ప్రయత్నించి పొదుపు దారులు తెలుసుకుంటాం
చిన్నా చితక వ్యాపారాలు చేస్తూనే ఉంటాం 
సంపాదించిన సొమ్మంతా
మా ఖాతాలో నిత్యం వేస్తుంటాం

చిన్న మొత్తాల పొదుపు ఖాతాను తెరుస్తాం
 ఉన్న విత్తమంతా అందులోన దాచి మేం మెరుస్తాం
వచ్చే వడ్డీతో మాఅప్పుల బాకి తీరుస్తాం
 తెచ్చు దొడ్డిదారి తప్పుల జాకీని మారుస్తాం

జబ్బుల వల్ల మన ఆరోగ్యం చెడకుండా 
డబ్బులవల్ల మనం ఇబ్బంది పడకుండా 
ఉండాలంటే ఇక మునుముందు 
దినమంతా చేయాలి ఒక పొదుపు విందు.

మా పొదుపు లో గండి పడకుండా మేం శ్రమిస్తాం 
అదుపులోఉండి చెడకుండా విశ్రమిస్తాం 
మదుపు దారిలోన మేమంతా పయనిస్తాం 
కుదుపు లేని కునుకుతోని శయనిస్తాం.


కామెంట్‌లు