మధు మధుమతి ఆదర్శ దంపతుల ఏకైక సంతానం రఘు.
తండ్రి మధు ఓ ప్రైవేట్ పాఠశాలలో
క్లర్కుగా పని చేస్తున్నాడు. కొడుకు రఘును అదే పాఠశాలలో చదివిస్తున్నాడు. తల్లి మధుమతి గృహిణి., విద్యావతి. ఇంటి వద్ద కుమారుడికి తరగతి పాఠ్యాంశం లతోపాటు, భారత, భాగవత, రామాయణం మొదలైన ఇతిహాసాలను గురించి బోధించేది.
కుమారుడికి కూడా తల్లి మాట అంటే వేదం. వారి వంశంలో పెద్ద చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారు ఎవరు లేరు.
దాంతో కుమారుడి నైనా పెద్ద చదువులు చెప్పించి ఓ పెద్ద ఆఫీసర్ హోదాలో చూడాలని ఆ తల్లిదండ్రుల తపన.
రఘు రోజు వెళ్లినట్లే ఆరోజు కూడా యధా ప్రకారం పాఠశాలకు తన సైకిల్పై వెళ్లాడు. మార్గమధ్యంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆగిపోయాడు. అక్కడ జనం గుమిగూడి ఉండడం గమనించి
తాను అక్కడికి వెళ్లి చూడగా రోడ్డుపై ఓ బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. చూస్తున్న వారంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నా రే తప్ప ఆమెను పట్టించుకున్న పాపాన పోలేదు.
వెంటనే రఘు తన సైకిల్ ను ఓ స్టోర్ లో పెట్టి ఆటోలో ఆ బాలికను తనకు తెలిసిన ఒక క ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో డాక్టర్ ఆ అమ్మాయిని పరీక్షించి రక్తం ఎక్కువగా పోయినందున అదనంగా మూడు బాటిల్స్ రక్తం అవసరం అని, అంతేకాక ఓ పదిహేను రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని ఖర్చు 15 వేల రూపాయలు అవుతుందని చెప్పగా
డాక్టర్ సార్ మీరు అయితే వైద్యం ప్రారంభించండి. ఆ డబ్బు ఎలాగైనా ఓ పదిహేను రోజుల్లో మా నాన్న గారిని అడిగి ఇస్తానని అని చెప్పాడు. అందుకు డాక్టర్
వెంటనే "మీ నాన్న నుఓ మాట అడుగుతా."అంటూ ఫోన్ చేసి తండ్రికి విషయం చెప్పాడు.
రఘు తండ్రి విషయం అర్థం చేసుకుని డాక్టరుతో ఓకే చెప్పడంతో వెంటనే డాక్టర్"చూడు రఘు ఈ అమ్మాయిని నేను చూసుకుంటా. నీ వెళ్లి ఆ డబ్బు సమకూర్చుకో" అని చెప్పగానే రఘు"థాంక్స్ డాక్టర్" అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటికి రాగానే రఘు హాల్ లో ఓ యువతి తన తల్లిదండ్రులను బతిమాలు కోవడం గమనించాడు."అయ్యగారూ రూ!
మీరే నా బిడ్డను కాపాడాలి. ప్రమాదం జరిగి ఆస్పత్రిలో ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. మీరే కాపాడాలి బాబు" అంటూ ప్రాధేయ పడుతోంది. తల్లిదండ్రులే మో ఆమెను ఓదారుస్తూ ఉన్నారు.
రఘు దగ్గరకు వెళ్లి చూడగా ఆమె వారి ఇంటి పని మనిషే. వెంటనే రఘు తండ్రి ఇ ఆస్పత్రికి ఫోన్ చేసి ఇ విచారిస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరేనని తెలిసింది.
రఘు తన తండ్రితో విషయం చెప్పబోగా "నాకు డాక్టర్ అంకుల్ అంతా విడమరచి చెప్పాడు"అనగానే రఘు ఊపిరి పీల్చుకున్నాడు. మానవత్వం తో తన కొడుకు వెంటనే స్పందించి ఓ చిన్నారి ప్రాణం కాపాడినందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. తమ ఇంటి పనిమనిషి కూతురు ప్రాణాలను కాపాడండి తమ కుటుంబ మర్యాదను ఇంకా ఇనుమడింపజేసినందుకు ఆ తల్లి తన కొడుకును ఆప్యాయతతో తన అక్కున చేర్చుకున్న ది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి