నీవుంటే సదనమంత
దివ్వెలా నిత్యము వెలుగు
లేకుంటే అంతయు
అంధకార మయమౌను
కాలికి బట్ట కట్టకుండ
కదులుతావుఅనుక్షణం
కాలముతోసమముగ
పరుగెడుతావుధైర్యముగ
వెనుకాడవు నెన్నడు
విజయాలతో ముందుకు
సాధిస్తావు ప్రగతిని
సమకూరుస్తావు సక్యతను
కష్టాల కడగండ్లకు
వెరువవు నీ వెన్నడు
సంసారరథం నడుపుకుంటు
సాగుతావు మునుముందుకు
సాధికారత వెదుక్కుంటు
సమర శీలిగ సాగుతావు
నీతోనే జగమంతా
వర్ధిల్లని మరువకు
సృష్టి కంతమూలము
ఆదిశక్తి యవతారము
మహిళా నీకు వందనం
అందజేతు మందరం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి