చెరువు నీటితో నిండుగ ఉండెను
నీటిపై తామరలు తేలుతుండె
బాతులు నీటిపై ఆడుచుండే
చేపలు నీటిలో తిరుగుచుండెను
నీటిలో జీవులు బతుకుతుండే
చేపలు నీటిలో పెరుగుతుండే
అలుగు నుండి నీరు దుముకుచుండే
తుమ్మెదలు నీటిని తాకుచుండే
పంటలు నీటితో పండుచుండే
పశుల పక్షుల దాహం తీర్చుచుండే
నీటిలోన సుడులు తిరుగుచుండే
నీటికెదురు చేపలెక్కుతుండే
చెరువు కింద పొలాలు పచ్చగుండె
సిరులు విరివిగా కురిపించుచుండె
మాకు సంతోషాలు నింపుచుండె
ఊరిలో జనమంత చక్కగుండె.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి