తొలితరం నటి గోపాలరత్నం వీరు1921లో తెనాలిలో జన్మించారు. సంగీతం తెనాలి సరస్వతి,జొన్నవిత్తులశేషగిరి గార్ల వద్దనేర్చుకున్నారు. లంకా కామేశ్వరరావు జారితో కలసి పాడిన పలు పాటలు గ్రాంఫోన్ రికార్డుగా ఇచ్చారు.'రుక్మిణి కల్యాణం' 'పుండరీక' 'రాథాకృష్ణా'' మీరా' వంటి పలునాటకాలలో నటించడమేకాకుండా సంగీత సహాకారంకూడా అందించారు.
సినీరంగంలో ప్రవేసించి పినపాక వెంకటదాసు గారు వేల్ పిక్చర్స్ పేరిట తడికలతో స్టూడియో (మద్రాలు ఆళ్వారు పేటలో)కట్టి అందులో దక్షణ భారతదేశంలో నిర్మించబడిన తొలి తెలుగు చిత్రం 'సీతాకల్యాణం' (1934)ఇందులో సీతగా నటించారు.మాస్టర్ కల్యాణ్ శ్రీరాముడిగా,తీగెల వెంకటేశ్వర్లు రావణుడిగా,మాధవపెద్ది వెంకట్రమయ్య విశ్వామిత్రుడుగా,ఇంకా రామతిలకం,నెల్లూరు నగరాజారావు తదితరులు నటించారు. ఈచిత్రానికి చిత్రపు నరసింహా రావు గారు దర్శకులు. అలావై.వి.రావు (నటి లక్ష్మి తండ్రిగారు)నిర్మించిన 'మళ్ళిపెళ్ళి' (1939)చిత్రంలో ఈమె రొండో కథానాయకి పాత్ర చేసారు. అందులో ఈమె పాడిన 'చెలికుంకుమయే ,పావనము-కోయిలరో,ఏదీ నీప్రేమగీతి-'గోపాలుడే' పాటలు వాడవాడలా మారు మోగాయి.అలా 'విశ్వమోహిని'(1940)బి.యన్.రెడ్డి గారి 'దేవత' 'దక్షయజ్ఞం' (1941) చిత్రంలో'రాదేచెలి నమ్మరాదేచెలి'-నిజమోకాదో, పాటలు బాగా పాపులర్ అయ్యాయి. 'భక్తపోతన' చిత్రంలో చిత్రంలో రాజనర్తకి పాత్రధారిణి సామ్రాజ్యం నికిపాడి తొలి ప్లేబ్యాక్ గాయనిగా గుర్తింపు పొందారు.'
తమిళ చిత్రాలలోకూడా ఈమె నటించారు.'మోహిని'అనేచిత్రంలో కథానాయకి మాధూరికి ఈమె పాడారు.అలా' జీవన్ముక్తి' (1942) చిత్రంలో నటిస్తూ,పి.సూరిబాబు గారితోకలసి పాడిన 'జోడు కొంటారా బాబు' పాట ఆరోజుల్లో మంచిపేరు పొందింది.'తహసీల్దా' (1944)'ముగ్గురు మరాఠీలు' (1946) చిత్రంలో రెండు పాటలు పాడింది.అనంతరం విజయావారి 'జగదేకవీరునికథ' (1961)చిత్రంలోని 'జలకాలాటలలో'పాటలో వీరు పాడటం విషేషం. మరలా ఆమె సినిమాలలో పాడిన దాఖలాలు లేవు.ఈమె తెలుగు సీనీరంగంలో ఒసంగీత సుగంథం,సీనీయవ్వన మధుర తరంగం,తేనేవాగు ప్రవాహాం.కాల ప్రవాహంలో ఎందరో సినిమా అతిరధ మహరధులు కలసిపోయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి