వీరి అసలుపేరు మానాపురం సత్యన్నారాయణ పట్నాయక్.వీరి అన్నపేరు మానాపురం అప్పరావు పట్నాయక్.వీరు సినీ పరిశ్రమలో దర్శకులుగా ఉన్నారు.1914 సెప్టెంబర్ 1న జన్మించిన అమరనాధ్ విద్యాపూర్తిచేస్తూనే, రాజమండ్రి వచ్చి స్ధిరపడి నాటక సంస్ధను స్ధాపించి 'రంగూన్ రౌడి' 'సానిసంసారం'నాటకాలు తెలుగు నేలపైనేకాకుండా కలకత్తా,ఖరగ్ పూర్, రంగూన్,బొంబాయి,మద్రాసు నగరాల్లో ప్రదర్శించి మంచి పేరుగడించారు. వీళ్ళసంస్ధలో యాళ్ళ అప్పారావు(నటుడు చిడతలఅప్పారావు) చిరు పాత్రలు పోషిస్తూ,పాటలకు చిడతలు వాయిస్తూ,మేకప్ వేస్తుండేవాడు. యండమూరిజోగరావు(సినీ హస్యనటుడు) తిలకం(మానాపురం అప్పరావుగారిభార్య)మరికొందరు ఉండేవారు.రంగూన్ రౌడి నాటకం లో వేదికపై బంగారుకంకణం తో సత్కరింపబడ్డారు.చివరి రోజుల్లో కాకినాడ సూర్యకళామందిరంలో వీరికి ఘనసన్మానంజరిగింది.
మానపురం అప్పారావు,తిలకం'పెంకిపిల్ల'(1951) చిత్రం తరువాత వివాహంచేసుకుని మద్రాసులో స్ధిరపడ్డారు.నిర్మాత దర్శకుడు చిత్రపునారాయణమూర్తి(1953) తను తీసిన చిత్రం 'నాచెల్లెలు.లో అమర్ నాధ్ గా పేరు మారుస్తూ ముఖ్య పాత్రఇచ్చారు.అమరనాధ్ కు,చలం, సూర్యకళ(సువర్ణసుందరిలో బంగారువన్నెల పాట నర్తకి)లకు ఇది తొలి చిత్రం.ఆతరువాత యోగానంద్ దర్శకత్వంలో 'అమ్మలక్కలు'(1953) 'చెరపకురాచెడేవు'(1955) పిచ్చిపుల్లయ్య(1953) 'సతీ అనసూయ' (1957)'పెంకిపెళ్ళాం'(1956) 'శ్రీరామాంజనేయయుధాధం'(1958) 'సతీ సుకన్య'(1959)'జగన్నాటకం'(1960) 'కనకతార'(1956) 'స్వయంప్రభ' (1957)'వదినగారిగాజులు' (1955)'చండీరాణి' (1953)'పల్లెపడచు'(1954) 'చక్రపాణి'(1954) 'వద్దంటే పెళ్ళి'(1957) 'అక్కాచెల్లెలు'(1957) ఆదుర్తివారి తొలి చిత్రం 'అమరసందేం'(1954)'శ్రీకృష్ణగారడి'(1958) తన ఇద్దరిభార్యలు సరళ చిత్ర బేనర్ తో కృష్ణకుమారి,రాజశ్రీ,చలం గార్లతో 'మగవారిమాయలు'(1960)నిర్మించారు.నేటి శ్రీలక్ష్శి కృష్ణకుమారి బిడ్డగా నటించింది. ఆ చిత్రంతో చేతులు కాల్చుకున్నారు. మరలా 'బాలయోగిని' చిత్రం నిర్మిస్తూ మధ్యలో1983మే 14 వ తేదిన జాండీస్ వ్యాధి ముదిరి మరణించారు.వీరి భార్య సరళాదేవికి ఎనిమిదిమంది సంతతి ఇద్దరు మరణించగా మిగిలిన ఆరుగురిలో ఇద్దరు మగవారు,నలుగురు ఆడపిల్లలు.కుమారుడు సినీ నటుడు కీ"శే"రాజేష్, ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి వీరి రెండో అమ్మాయి. అందాలనటుడు శోభన్ బాబులా కథానాయకుడుగా మాత్రమే ఉన్ననటుడు అమరనాధ్ అంటే అతిశయోక్తికాదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి