61. ఆ.వె. సేవ జేయుచుండ చెడు మాటలందురు
పట్టనట్లు నున్న ఫలితముండు
నడిచెయెద్దు నెపుడు పొడిచేరు కర్రతో
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
62. ఆ.వె. ఎంత వేడుకున్న నేమి చేసిన గాని
జ్వాల యివ్వలేదు చల్లదనము
దీపములను ముట్ట దేహము గాల్చదే
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
63. ఆ.వె. ఒక్క కొడుకు చాలు చక్కని పేరొంద
వాని వల్ల వచ్చు వంశ కీర్తి
కౌరవులను నూరు కలిగేనేమి ఫలంబు
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి