70. ఆ.వె. గగన భవనమునకు కడు భద్రతనుకొని
పైన మేడలందు ప్రజలు నుండ
పుడమి దిగుటనెట్లు భూకంపమును రాగ
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
71. ఆ.వె. ప్రతిభ గల్గియున్న పరిపరి విధముల
తగిన సమయమందు తాను వెడలు
మల్లె పరిమళమును మరి దాచవచ్చునే
రమ్య సూక్తులరయు రామకృష్ణ
72. ఆ.వె. నిమ్మ చెట్టు పొగడ బమ్మ తరము గాదు
ముళ్ళు నున్న నేమి పళ్ళు నిచ్చు
దీక్షనంత్యమందు దివ్యౌషధము గాదె
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి