నీతి పద్యాలు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి-మొబైల్: 9908554535.
55.ఆ.వె. సమయ పాలనంబు చక్కగా పాటించు
               సమయము మరి రాదు శ్రమల బడిన
               అనుసరించు నీవు అంబేడ్కరును ధర
               రమ్య సూక్తులరయు  రామకృష్ణ.

56. ఆ.వె. హాయిగాను నుండు మాడంబరము లేక
                స్థాయికి తగి యున్న తక్కువగునే
                విద్య సాగరుడును వెలుగడే  వంగలో
               రమ్య సూక్తులరయు  రామకృష్ణ.

57. ఆ.వె. ఐకమత్యమున్న  నాజికెవరు రారు
                కలసి యుండునంత  గలుగు ఫలము
                గువ్వలన్ని కలిసి గుంపుగా నెగురవా
                రమ్య సూక్తులరయు  రామకృష్ణ.


కామెంట్‌లు