జ్ఞానమునకి మూలం వేదముజగత్తుకి మూలం ధనమువేదధనము మించినది లేదోయి!వేనోళ్ళ ప్రపంచానికి చాటాయి!!అత్యాశ అనర్థానికి మూలందురాశ దుఃఖానికి మూలంకోపమే పుణ్యానికి విరోధంకోరికయే మోక్షానికి అవరోధంప్రేమ బంధాన్ని నిలబెట్టుద్వేషం బంధాల్ని కూలగొట్టుప్రేమయే శాంతికి ఆధారం!ద్వేషమే అశాంతికి ఆకరం!!పుట్టినపుడు తేలేదు సంపదలుగిట్టినపుడు వెళ్ళలేవు సంపదలువంచనకు మించిన వికారమేముంది?మంచితనం మించిన సంపదేముంది?విద్య సార్థకమొందు వినయంతోధనం సార్థకమొందు ధర్మముతోజన్మ సఫలతనొందు మోక్షంలోనే!కర్మ సఫలతనొందు నిష్కామంలోనే!మనసుని జయించుట అవసరంమాటని నియంత్రించుట అవసరంమంచితలపు వేయును రాచబాటనుమంచిమాట నిల్పును పూలబాటను
నైతిక వికాస సూత్రాలు:--సాకి, కరీంనగర్,9951172002
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి