ఉడత దాహం( బాల గేయం):-ఎడ్లు లక్ష్మి-సిద్దిపేట
భగభగ ఎండలు మండంగా
పండుటాకులు రాలంగా
చెట్టు మోడువారంగా
చెంగు చెంగునెగురుతూ

చిట్టి ఉడత వచ్చింది
చిన్నగ మెల్లగ దూకింది
రాలే ఆకును పట్టింది
తలపై నీడగా పెట్టింది

సూర్యుడి నేమో చూసింది 
దాహం దాహం అంటూ
బోరున ఉడుత ఏడ్చింది
జాలిగా భానుడినడిగింది

సూరీడు మబ్బుల్లో దాగాడు
నల్లని మేఘాలను పంపాడు
చిటపట చినుకులు చల్లాడు
ఉడుత దాహం తీర్చాడు


కామెంట్‌లు