బంగారం లాంటి పిల్లలు 
బడికి వెళ్లారు 
సింగారం పాఠాలు 
చదివేశారు 

చిట్టీ పొట్టి పలుకులతో 
చిందులేశారు 
గట్టి గట్టిగ ఎక్కాలు 
ఒప్ప జెప్పారు 

గోడ మీది పద్యాలు 
పాడుతున్నారు 
గురువు గారి మాటలన్నీ 
వింటున్నారు 

విరామంలో వెలుపలికి 
పరుగు తీశారు 
అంగడిలో అప్పచ్చులు 
కొని తిన్నారు 

మధ్యాహ్నం భోజనాలకి 
వరుస తీరారు 
కుదురుగానే అన్నం తిని 
పళ్లెం కడిగారు 

మరల మరల పలకమీద
రాసుకున్నారు 
ఇంటిగంట వినగానే 
తుర్రు మన్నారు !!

కామెంట్‌లు