చిలుక జోస్యం.:- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.


  పదవతరగతి చదువుతున్న సుందరం ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేదారిలో చెట్టుకింద అరుగుపైన చిలకజోస్యం చెప్పవ్యక్తిని చూస్తుంఉండేవాడు. ఒకరోజు తను దాచుకున్న డబ్బుల్లో పదిరూపాయలు చిలకజోస్యం చెప్పే వ్యక్తికి ఇచ్చి తన జాతకం చెప్పమన్నాడు. చిలుకజోస్యం చెప్పేవ్యక్తి  చిలుక బోను తలుపుతెరచి 'రావమ్మ చిలకమ్మ ఈ అబ్బాయి జాతకం చెపుదువుగాని'అన్నాడు బోనులోని చిలుక వెలుపలకువచ్చి,అక్కడ వరుసగా పేర్చి ఉన్న అట్టలలో ఒకఅట్టతీసి  జోతిష్యుని వద్ద పడవేసి బోను లోనికి వెళ్ళింది చిలుక. అట్టలోపలి కాగితాన్ని వెలుపలకుతీసి దానిలోపల ఉన్నవిషయాలను వివరించసాగాడు సుందరానికి  జోతిష్యుడు.ఆదే దారిలో వెళుతున్న సైన్స్ ఉపాధ్యాయుడు, చెట్టుకింద చిలకజోస్యం చెప్పించుకుంటున్న సుందరిన్ని చూసి నవ్వుకుంటూ పాఠశాలకు వెళ్ళిపోయాడు.

పాఠశాల తరగతి గదిలో సైన్స్ పాఠం చెప్పడానికివచ్చిన ఉపాధ్యాయుడు సుందరాన్నిచూస్తు''సుందరం ఉదయం చిలకజోస్యంలో నీజాతకం గురించి ఏంచెప్పారు''అన్నాడు. ''సార్ నేను ఈసంవత్సరం పాస్ అవుతానట ఇంకా చాలావిషయాలు చెప్పాడు అందుకే నేను పాస్ అయితే దేవుడికి తలవెంట్రుకలు ఇస్తానని మొక్కుకున్నా''అన్నాడు సుందరం.  

" బాలలు చిలుక రెక్కలు కత్తిరించి బోనులో బంధించడవలన అది  బంధి అయింది.జోతిష్యుడు తనకు నేర్పిన విధంగా,బోను తలుపు తీయగానే వెలుపలకు రావడం ఏదోఒకఅట్టముక్క జోతిష్యునిముందు పెట్టడం, అతను అందించిన వడ్లగింజ తింటూ మరలా బోనులోనికే వెళుతుంది చిలుక.నిజంగా చిలుకకు మనజాతకాన్ని గ్రహించే శక్తి ఉంటే తను జోతిష్యునికి తనుబంధీగా ఎందుకుంటుంది?తనకు జాతకం తెలిస్తే జోతిష్యుని చేతికి చిక్కకుండా పారిపోఏది కదా! తనకు జాతకం తెలియకనే జ్యోతిష్యునికి చిక్కింది.అందరి జాతకాలు చెప్పే జోతిష్యుడు తన జాతకం ఎలామారుతుందో తెలియకనేకదా చెట్టుకిందకూర్చోని ఇలాబ్రతుకుతుంది. మనజాతకం మనకృషి,పట్టుదల, ఆలోచనా విధానాలపైనే ఆధారపడి ఉంటుంది. విజయమైనా,ఓటమైనా మనకృషిపైనే ఆధారపడి ఉంటుంది. మనజాతకంపైన కాదు. నమ్మకంవేరు శ్రమించడంవేరు .శ్రమే మనిషికి మూలధనం శ్రమను నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపోడు.మనకు ఆత్మవిశ్వాసం కలిగించేది నమ్మకం. జీవితంపైన ఆశకలిగించేది రేపటి రోజు.మనకు ఇష్టమైన పనిచేస్తున్నప్పుడు కష్టం తెలియదు.విద్యను కష్టంగాకాదు మనసుపెట్టి ఇష్టంగా చదవాలి అప్పుడే మీరు ఉత్తిర్ణత సాధించగలరు. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వేదిక్కు అంటే దీపం ఆరిపోకుండా ఉంటుందా? దీపం ఆరిపోకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలి.దైవత్వం అనేది నమ్మకం మాత్రమే! కాని ఇక్కడ మానవప్రయత్నం లోపం ఉండకూడదు. కనుక శ్రధ్ధగా చదవండి ఉత్తమ ఫలితాలు సాధించండి.గాలిలో మేడలుకట్టకండి.ఊహాలోకంలో జీవించడం అత్యంత ప్రమాదం.కృషితోనే అభివృధ్ధి సాధించగలం అనితెలుసుకొండి' అన్నాడు సైన్స్ ఉపాధ్యాయుడు.బుధ్ధిగా తలలు ఊపారు పిల్లలంతా.

                  


కామెంట్‌లు