చెట్టు ప్రశ్న : జగదీశ్ యామిజాల

 నా కొమ్మలను
నరుకుతున్న కొద్దీ
నేను మళ్ళీ మళ్ళీ
చిగురిస్తూనే ఉంటాను
కానీ
మీ మనుషుల మధ్య 
బంధాలలో చీలికలొస్తే
మళ్ళీ మాలాగా 
చిగురించగలరా అనే
చెట్టు ప్రశ్నకు
జవాబెక్కడ....!?!
కామెంట్‌లు