ఎండకు జై !:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 ఎండలమ్మ ఎండలు

మండిపోయె ఎండలు

వేడిని ఇచ్చే ఎండలు

దాహం వేసే ఎండలు

చెరువులు అన్నీ ఎండాలీ

నింగికి నీరూ చేరాలీ

నల్లని మబ్బులు పుట్టాలీ

చక్కగ వానలు కురవాలీ

పంటలు దండిగ పండాలీ

ప్రజలు సుఖముగ ఉండాలీ

అందుకె ఎండలు కావాలీ

ఎండలకందుకె జైజైజై !!


కామెంట్‌లు