మంచి సూక్తులు :-ఎడ్ల . లక్ష్మి
ఈతచెట్టు ఇల్లు కాదు
తాడిచెట్టు తల్లి కాదు
ఉన్న దాంట్లొ తృప్తి చెంద
బతుకు లోన బాధ రాదు
వారెవ్వా  తృప్తిగుంటే
బాధ లేని బ్రతుకులు
             
మాట పెదవి దాటితే 
పృథ్వి దాటి పోవును
కాలు జారగ నేమో
కదిపి పెట్టి నిలుచున
వారెవ్వా నోరు జారిన మాట
జగమంతా పరుగల బాట
                 
పొదుపు చేసిన ధనం 
అదుపు నుంచగ మనం
మేలు జరుగు నెప్పుడు
కానే కాదు రుణం
వారెవ్వా ధనం పొదుపు
జీవితంలో ఉన్నత బ్రతుకు
                 
అప్పు చేస్తే ముప్పు
నిన్ను గట్టిగా తిప్పు
మనోవ్యాది నెప్పుడు
నిగురు కప్పిన నిప్పు
వారెవ్వా అప్పుల తిప్పలు
గుండెలమీద కుంపట్లు
                
కోప మేమొ శతృవు
శాంతి మేము మితృవు
అవి రెండు తోడు నీడలు
గమనించి చూడు నీవు
వారెవ్వా శాంతము
ఎంత పెద్ద భూషణం


కామెంట్‌లు