అరటిచెట్టు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

తాత గారు వచ్చారు
అరటి మొక్క తెచ్చారు
పాదు చేసి పెట్టారు
పెరటి లోనా నాటారు

నూతిలో నీళ్ళు తోడారు
నాటిన మొక్కకు పోసారు
మారాకు వేసి పెరిగింది
మొగ్గ దశకు వచ్చింది

పెద్దగా గెల వేసింది
కాయలెన్నో కాసింది
కాయలు దోరకొచ్చాయి
నాన్న గెలను కోసారు

జోరతట్ట చుట్టారు
గడ్డివాములో దాచారు
అరటి పండ్లు తిన్నాము
హాయిగా మేమున్నాము

కామెంట్‌లు