లాంతరుకు సలాం:- కవిత వేంకటేశ్వర్లు
 చిమ్నీ బుడ్డి
లాంతరు
కరెంటు లేని వారికి
ఆ వెలుగే దిక్కు వారందరికి
కిరోసిన్ అనే ఇంధనం వేసి
ఒత్తిని సరి జేసి
అగ్గిపుల్లతో అంటింజేసి
ఆ చిన్న వెలుగులో
చదువు కున్నాము
పర్ణశాల లాంటి కొట్టంలో
గుడ్డి దీపపు వెలుగులో
సాగించినాము చదువు
మాలాంటి పేదోళ్లకు 
ఇంద్రభవనపు వెలుగు జిలుగులు 
మాజీవితాలకు వెన్నెల రేఖలు
మా బ్రతుకులను బాగుచేసిన
ప్రకాశవంతమైన రహదారులు
ఎందరి జీవితాలను బాగుచేసిన లాంతరు
ఎందరి దారులను మార్చేసిన లాంతరు
ఎందరినో నాయకులను చేసిన లాంతరు
ఎందరికో మంచి పదవులు
ఎందరినో ఆఫీసర్లుగా తీర్చి
దిద్దిన లాంతరు
ఎందరినో కవులుగా
రచయితలుగా మార్చిన లాంతరు
అటువంటి లాంతరుకు లాల్ సలాం
సాంకేతికంగా మార్పులేన్ని
వచ్చిన నేను లాంతరుకు గులాం!!
               
కామెంట్‌లు