అల్లా ఉద్దీన్ అద్భుతలాంతర్
చమురు వత్తితో వెలిగే లాంతర్
పాత రోజుల చదువు సాధనం
ఇంటికి ఒకటో రెండో అదనం
దీపం బుడ్డి సంధ్య వేళలో
ముగ్గు పిండితో తుడవాలి
నిన్నటి రోజు మసి తొలిగించి
వెలుగుకు సిద్ధం చేయాలి !
చమురు నిల్వను గమనించాలి
వత్తికి నుసిని రాల్చేయాలి
దీపం జ్యోతి పర బ్రహ్మమని
వెలిగించి దండం పెట్టాలి !
మనసొక దీపం జ్ఞానం రూపం
తనువును నడిపే తరుణోపాయం
మూర్ఖత మసిని తుడిచే యాలి
విజ్ఞత వత్తిని వెలిగించాలి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి