చిన్ననాటి పేపర్ పడవలు (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చెల్లి తమ్ముడు రారండి
నల్లని మబ్బులు వచ్చాయి
జిలజిల మెరుపులు మెరువంగా
చరచర ఉరుములు ఊరుమంగా

చిటపట చినుకులు కురువంగా
వాకిట్లో వరదలు పారంగా
పేపర్ పడవలు చెద్దామా
కలిసి మనము వేద్దామా

పరుగులు తీస్తూ

ఆ పడవ
చెరువులోకి చేరును
మత్తడి దూకి ఆ పడవ
చిత్తూరు లోన ఆగును

చిన్నగా మెల్లగా నడుస్తూ
చిత్తూరు చేరా పోదాము
అక్క బావను చూద్దాము
ఆగిన పడవను తెద్దాము

కామెంట్‌లు