హరివిల్లు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పూలతోటలో పువ్వులము
రంగురంగుల రంగులము
సుకుమారులం సుందరులం
మల్లె మొల్ల మంకెన
కలువ కమలం కాంచన
మొగిలి మోదుగ మందార
గునుగు గోరెంక గన్నేరు
కట్ల సంపెంగ చల్లగుత్తి
బంతి చేమంతి గులాబి
పొగడ పారిజాతం పట్టుకుచ్చులు
ఏపేరైతే ఏమమ్మా
మేమంతా ఒక్కటేనమ్మా
వర్ణభేదాలు మాకులేనివి
మేమంతాకలిసి ఈ తోటను
హరివిల్లుగ మార్చేస్తాము
అందరికీ కనువిందు చేస్తాము
ఆనందాన్ని పంచేస్తాము !!

కామెంట్‌లు