పండితపుత్రుడు:- సత్యవాణి

  నేను రేపటి నుండి స్కూలుకి
వెళ్ళను" స్కూలునుంచి వస్తూనే
బ్యాగు పారేసి ఏడుస్తూ గదిలోకెళ్ళిపోయాడు ఆరు  చదువుతున్న మోహన్ .
                  ఏంనాయనా! ఏంజరిగింది ,ఆందోళన పడుతూ
మనవడిదగ్గరకువెళ్ళింది వాడి నాయనమ్మ.
             " అమ్మా నాన్నా నన్ను
పట్టించుకోరు నాయనమ్మా! నేనలసిపోయొచ్చేనంటే, నేనంతకన్నా అలసిపోయాను అంటూ ,వాణ్ణి చదివించే బాధ్యత
నీదంటే,నీదని, నా ఎదురుగానే
గొడవలు పడతారు.చక్కగా మాఫ్రెండ్సందరికీ మంచి మార్కులు
వస్తాయి. వాళ్ళ అమ్మా నాన్నలు మంచివాళ్ళు.
వాళ్ళకు అర్థం అయ్యేలా దగ్గర కూర్చోపెట్టుకు చెబుతారు.
                    మా టీచర్లు కూడా
"మొహన్ అమ్మా నాన్నలిద్దరూ ,
హైస్కూల్లో టీచర్లు. కానీ వీడేమో పండిత పుత్ర పరమ శుంఠ లా తయారయ్యాడు" అంటుంటే
నా ఫ్రెండ్సుకూడా నన్ను "శుంఠా శుంఠా "అంటూ ఏడిపిస్తున్నారు.
 అందుకే నేనింక స్కూలుకి వెళ్ళనంటే వెళ్ళను "అని మోహన్ అంటుంటే !అప్పుడే వచ్చి వాడి మాటలు విన్న
మొహన్ తల్లిదండ్రులకు వాడిమాటలు వానడం తటస్థించింది. తామిద్దరి
అహం వల్ల  పిల్లాడు పడుతున్న మానసిక క్షోభ వారికి తెలిసివచ్చింది.  
 తమ పట్టుదలలతో పంతాలతో మూర్ఖంగా ప్రవర్తించి ఎంతపొరపాటు చేశారో తెలిసింది వారికి.
                   "నాన్నా మోహన్ !
"నీ హోమ్ వర్కు తీసుకురా! నీకు
తెలియని సబ్జక్ట్స్  మమ్మల్ని అడుగు. నాకు తెలిసినవి నేనూ, అమ్మకి తెలిసినవి అమ్మా చెపుతాం! ఇకపై
"పండిత పుత్రుడు మహాపండితుడు "అనిపిస్తాం!
సరేనా!"అని తండ్రి చెప్పగానే, మోహన్ కళ్ళు సంతోషంతో నక్షత్రాల్లా మెరిసి పోయాయి.ఇంతకుముందు కోపంగా పారేసిన స్కూలు బ్యాగును పదిలంగా తెచ్చుకొవడానికి
ఒక్క పరుగు తీసాడు హుషారుగా మోహన్ .
                 
కామెంట్‌లు