ఇంగ్లీష్ పరీక్ష( బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
రా రా రా రా ఓ రాజు
నేడు పరీక్ష ఉన్నది
పేపర్ లోన రాయండి 
అమ్మ నాన్నల పేర్లండి

అమ్మ పేరు రాయాలా
సన్ మదర్ అంటారు
నాన్న పేరు రాయాలా
మూన్ ఫాదర్ అంటారు

నాపేరు రాయాలా
కింగ్ బాబు అంటారు
చెల్లి పేరు రాయాలా
స్టార్ పాప అంటారు

తెలుగు పేర్లను నేనేమో
ఆంగ్ల భాషలో రాశాను
మెదడుకు మేత పెట్టండి
తెలుగులో పేర్లు చెప్పండి


కామెంట్‌లు