రాధ అడిగింది రాళ్ల జుంకీలు
అమ్మ కసిరింది దూకె కన్నీళ్లు
రైతు కుటుంబంలో ముంచుకష్టాలు
ఆశతీరుటలో ఎన్నోఅడ్డాలు !
చదువు సాగాలి శ్రధ్ధ పెరగాలి
మంచిమార్కులతో పాస్ కావాలి
పట్టుదలతోనే పాప చదివింది
గట్టిధ్యేయంతో గట్టు చేరింది!
సెలవుల్లో రాధ చేనుకెళ్ళింది
కలుపు నారేతకు కూలివచ్చింది
రాత్రిబడిలోన పాఠాలుచెప్పింది
వయోజన విద్యకు బహుమతొచ్చింది!
సొమ్ముతీసి అమ్మ చేతికిచ్చింది
అంతలో పుట్టినరోజు వచ్చింది
అమ్మ రాధకు బుట్టకమ్మలేసింది
బంగారుజుంకీల రాధ నవ్వింది!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి