అయిదేళ్ళ చిన్నారి అమృత తన తల్లితో కలిసి సూపర్ మార్కెట్టుకి వెళ్ళింది. అక్కడొక ముత్యాలమాల చూసింది చిన్నారి. అది కొనివ్వమని పట్టుపట్టింది.
"అమ్మూ...ఇది చూడ్డానికి అందంగానే ఉంది. ఇది ప్లాస్టిక్ మాల. కనుక ఇది వద్దులే. నాన్నతో చెప్పించి నీకు నీ పుట్టినరోజుకి అసలుసిసలు మాల ఒకటి కొనిస్తానులే" చెప్పింది తల్లి.
కానీ చిన్నారి అదే కావాలని కొనిపిం చుకుంది.
అది ప్లాస్టిక్ మాలే కావచ్చు కానీ అది చిన్నారికి అత్యంత ప్రియమైన మాలగా మారింది.
తన తల్లితో ఎక్కడికి వెళ్ళినా ఆ మాల వేసుకునే వెళ్ళేది.
స్కూలుకి వెళ్తున్నప్పుడూ, మిత్రులతో కలిసి ఆడుకుంటున్నప్పుడు కూడా అది చిన్నారి మెడలోనే ఉండవలసిందే.
అది ప్లాస్టిక్ మాల కావడంతో ఎప్పుడూ మెడలోనే ఉంటే ఏదైనా అలర్జీలాంటిది రావచ్చని, కనుక ఎప్పుడైనా ఒకసారి వేసుకోమని తల్లి ఎంత చెప్పినా పట్టించుకోలేదు చిన్నారి.
చిన్నారి తండ్రి ఎంతో మంచివారు. కూతురంటే ఆయనకు ప్రాణం. రోజూ పడుకునే ముందు ఆయన కూతురికి ఏదో ఒక కథ చెప్తూ ఉండేవారు.
రోజూలాగానే ఆ రోజూ ఆయన కథ చెప్పాక "అమ్మూ, నేనంటే నీకు ఇష్టమేగా" అని అడిగారు.
"అవును నాన్నా. నువ్వంటే నాకెంతో ఇష్టం నాన్నా...." అంది చిన్నారి.
"మరి నీ మెడలో ఉన్న ముత్యాల మాల నాకిస్తావా" అడిగాడు తండ్రి.
కానీ చిన్నారి "నాన్నా అదొకట్టి అడగకు. అది కాకుండా మరేదడిగినా ఇస్తాను. నా దగ్గరున్న బొమ్మలలో ఏది కావాలన్నా తీసుకో నాన్నా... కానీ ఈ ముత్యాల మాల మాత్రం అడగొద్దు నాన్నా" అని కచ్చితంగా చెప్పేసింది.
మరొకరోజు ఆయన మళ్ళీ ఓ కథ చెప్పి "నేనంటే నీకు ఇష్టమేనా" అని అడిగారు.
"అవును నాన్నా. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం" చెప్పంది అమృత.
"మరి నీ దగ్గరున్న ముత్యాల మాల నాకివ్వవా" అడిగారాయన అవీ ఇవీ చెప్పి.
కానీ చిన్నారి ఇవ్వలేదు. అది తప్ప మరేది అడిగినా ఇస్తానంది. తన దగ్గరున్న గుర్రం బొమ్మ కావాలంటే తీసుకోమంది. ముత్యాల మాల మాత్రం ఇవ్వనని చిన్నారి మళ్ళీ గట్టిగానే చెప్పింది.
కొన్ని రోజులు గడిచాయి.
ఓరోజు నాన్న రాత్రి కథ చెప్పడానికి సిద్ధమవుతుండగా చిన్నారి అమృత "ఇదిగో నాన్నా!" అంటూ ఓ చిన్న పెట్టెను ఇచ్చి అందులో ఉన్న ముత్యాలమాలను చూపించింది. అందులో కొన్ని పూసలు రాలిపోయున్నాయి. పైగా పాతబడి ఉంది.
దాన్ని తీసుకున్న నాన్న తన తలగడ పక్కనే ఉన్న ఓ నీలి రంగు పెట్టె కూతురు చేతికిచ్చారు. అందులోనిది నిజమైన ముత్యాల మాల. అది నిజమైనది కావడంతో ఎంతో అందంగా ఉంది. పైగా కొత్తదికూడా.
నిజమైన ఈ కొత్త మాలను నీకివ్వడం కోసమే అప్పుడప్పుడూ నిన్ను నీ దగ్గరున్న మాలను ఇవ్వమని అడిగానురా" అన్నారాయన.
ఈ తండ్రి ఇంకెవరో కాదు. మన అందరికీ తండ్రి అయిన ఆ భగవంతుడే.
ఆ చిన్న పిల్లే మనమే.
అవును. ఇలాగే మనమూ మన జీవితంలో కొన్ని సాధారణ విషయాలను గట్టిగా పట్టుకుని వదులుకోవడానికి ఇష్టపడం.
అటువంటి అనవసరపు విషయాలను విడిచిపెడితే భగవంతుడు నిజమైనవాటిని మనకు కానుకగా ప్రసాదిస్తాడు.
మన అనవసర అలవాట్లు, చర్యలు, ఆలోచనలు, దుష్టుల సాంగత్యం వంటివి మనతో పెనవేసుకుని ఉండొచ్చు. వాటి వల్ల మనకు కష్టాలే తప్ప సుఖాలు ఉండవు. అయినప్పటికీ వాటివి విడిచిపెట్టడానికి ఇష్టపడం. వాటికన్నా మేలైనవి, మంచివీ మనకోసం నిరీక్షిస్తుంటాయి. అటువంటి వాటిని పొందాలంటే అనవసరమైన, చవకబారు విషయాలను మనం విడిచిపెట్టాలి.
ప్రేమస్వరూపుడైన భగవంతుడు విశేషమైనదొకటి ఇచ్చిగానీ మన నుంచి మరేదీ తీసుకోడు.
కనుక ఈ నిజం తెలుసుకుందాం...స్పష్టతతో ఉందాం.
-

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి