నవ్వుల చిలుక (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పిల్లలంతా రారండి 
నవ్వుల చిలుక వచ్చింది 
పువ్వులు తెంపి వేసింది
కిలకిల చిలక పలికింది

చేతిలో బుట్టలు పట్టండి 
వేసేన పువ్వులు నింపండి
బుట్టలో పువ్వులు తీయండి
మాలలు మీరు కట్టండి

కట్టిన మాలలు పట్టుకుని 
చెట్టు మీదికి ఎక్కండి
మాలల ఊయల కట్టండి
చిలుక వచ్చి చూస్తుంది

ఊయల ఎక్కి చిలుకమ్మా
అటూ ఇటూ ఊగుతూ
కొమ్మల రెమ్మల పండ్లను
తెంపి మీకు ఇస్తుంది

తియ్యగా పండ్లు తినండి
ఆటపాటలు నేర్వండి
కలతలన్ని మరువండి
హాయిగా మీరు ఉండండి

కామెంట్‌లు