బయటికి _
వెళ్ళలేను ,
(వెళ్ళకూడదు )
ఇంట్లో _
ఉండలేను ,
(ఉండి తీరాల్సిందే )
ఎంత సేపు ,
పుస్తకాలు చదవను ?
ఎంతసేపు _
టి.వి .చూడను ?
ఎంతసేపు ,
అయినవారికి _
ఫోన్ చేయను ?
ఎంతసేపు ,
ముచ్చట్లతో _
కాలక్షేపం చెయ్యను ?
ఎంత సేపు ,
మొబైల్ తో ,
మెసేజ్ గేమ్ ఆడను ?
తిరిగేకాలుకదా ,
ఊరుకోదు కదా!
వద్దంటే ...
చేయాలనిపించడం ,
మానవ సహజం కదా !
ఏమీ చేయలేని,
సంధి కాలం ఇది,
ఇంట్లో ..
నాలుగు గోడలను ,
మాస్క్ గా చేసుకుని ,
తృప్తిగా ...
గాలి పీల్చుకుంటున్న ,
కరోనా ..ను ,
తరిమికొట్టడానికి ,
బుద్దిగా __
కవిత్వం రాసుకుంటున్నా !!
--------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి