ఎందుకనీ:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 నిండు జాబిలీ

నింగిలొ ఉండును ఎందుకనీ?

అందరిపై వెన్నెల

సమముగ పంచును అందుకనీ!

వాయువెప్పుడూ

నిలువక తిరుగును ఎందుకనీ?

సర్వప్రాణులకు 

అవసరమగును అందుకనీ!

కొబ్బరి చెట్టుకు

కొమ్మలు ఉండవు ఎందుకనీ?

కాయల బరువుకు

కొమ్మలు విరుగును అందుకనీ!

నేలను పచ్చిక

ఒత్తుగ మొలుచును ఎందుకనీ?

మెత్తని మన్నుకు

రక్షగ నిలుచును అందుకనీ!

తామరాకుపై

నీరు నిలువదు ఎందుకనీ?

తామరాకుపై

మైనపుపొర ఉండును అందుకనీ!


కామెంట్‌లు