మెట్రో బండి వచ్చింది
మెల్లమెల్లగా ఆగింది
చిన్నా పెద్దా ఎక్కండి
ఎంతో చల్లగ ఉంటుంది
పట్నం బండి చూడుడి
పల్లీ బటాని అమ్మరు
బస్తీ బండి అదేనండి
పండ్లు బజ్జీలమ్మరు
సిగ్నల్ దానికి పడదండి
పయనం హాయిగుంటుంది
మనం దిగేచోటు రాగానే
స్టేషన్ పేరు చెపుతుంది
ద్వారం తీసి పెడుతుంది
గబగబ మీరు దిగాలండి
ఆలస్యం మీరు చేసారంటే
అది ముందుకెళ్లి పోతుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి