కాకి మిత్రుడు:- సత్యవాణి
కాకి మనకు మిత్రుడు
కల్మషాలు మ్రింగును
స్వఛ్ఛభారతీయుడల్లె
ఉంచుపెరడు నీటుగా

కాకి రైతు మిత్రుడు
పైరుపురుగులేరును
పశులబాధపెట్టునట్టి
పురుగుల పనిపట్టును

కాకి అమ్మమిత్రుడు
చుట్టమొచ్చుననుచు అరచి
ముందుగానె తెలుపును
మరలవంట చెేయుబాధ
మరలించును చక్కగా

కాకి పాపమిత్రుడు
పాపవేయు మెతుకులకై
పాపచెంత చెేరును
హాత్ కాకి అనగానే 
అరచి ఎగిరిపోవును

           
కామెంట్‌లు