రోజూ క్రమంతప్పక ప్రార్థించే దేవుడితో ఓరోజు మాట్లాడే అవకాశం కలిగింది
నేను : నేను మిమ్మల్నొకటి అడగొచ్చా?
దేవుడు : తప్పక అడగొచ్చు.
నేను : కోప్పడకుండా ఓపికతో జవాబిస్తారా?
దేవుడు : తప్పకుండా
నేను : ఈరోజు ఎందుకు నాకు మరీ ఇంత దారుణమైన రోజిచ్చారు
దేవుడు : ఏమంటున్నావు
నేను : ఎప్పుడూ టైముకి లేచే నేను ఈరోజు ఆలస్యంగా లేచాను
దేవుడు : అవును. తొందర్లో నాకు దణ్ణం పెట్టకుండా ఆఫీసుకి వెళ్ళిపోయావు
నేను : బయలుదేరిందే లేటు. పైగా బండి చెడిపోయింది.
దేవుడు : ఆవును. తెలుసు నాకు.
నేను : సరే. బస్సులో వెళ్దామనుకుని బస్సెక్కుతే దార్లో యాక్సిడెంటు. ట్రాఫిక్ జామ్. ఆఫీసుకి గంట లేటు.
దేవుడు : అవును. తెలుసు.
నేను : మధ్యాహ్నం క్యాంటీనుకి లేటవడంతో అక్కడ మీల్స్ అయిపోయాయి. అడుగూబొడుగూ మిగిలితే కాస్త తిన్నాను.
దేవుడు : అవును. తెలుసు.
నేను : బ్యాంకులో పర్సనల్ లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను. అందుకోసం ఓ వ్యక్తి నుంచి ఫోన్ కోసం ఎదురుచూసాను. సాయంత్రం ఆ మనిషి నుంచీ ఫోన్ వచ్చింది. మాట్లాడుదామనుకునేసరికి బ్యాటరీలో ఛార్జ్ లేకుండా ఫోన్ ఆఫై పోయింది.
దేవుడు : అవును. తెలుసు.
నేను : ఇంటికీ చిరాకుగా చేరాను అదీ ఇదీ బస్సెక్కి. ఎసి ఆన్ చేసి టీవీ చూద్దామనుకుంటే ఏసీ రిపేర్. పని చేయలేదు. ఈరోజు నాకేదీ కలిసి రాలేదు. నీకు నమస్కారం పెట్టడం మరచిపోయినందుకు ఇంతలా శిక్షిస్తావా?
దేవుడు : గట్టిగా నవ్వారు.కొన్ని నిముషాల తర్వాత మాట్లాడటం మొదలుపెట్టాడు.
దేవుడు ': ఈరోజు నీ కర్మ ప్రకారం దారుణమైన రోజిది. నువ్వు ఆదమరచి నిద్రపోతున్నప్పుడే మృత్యుదేవత నీకోసం వచ్చాడు. అతనితో నేను వాదించి నిన్ను కాపాడటానికి రోజుకన్నా ఎక్కువసేపు నిద్రపోయేలా చేసాను.
నేను : విస్తుపోయాను.
దేవుడు : నీ బండి చెడిపోయేలా చేసాను. ఎందుకంటే నువ్వు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు నువ్వెళ్ళే రూట్లో బ్రేక్ పట్టక అడ్డదిడ్డంగా నడిచిన వ్యాన్ నిన్ను డీకొట్టే ప్రమాదముంది. ఆ వ్యాన్ యాక్సిడెంట్ కావడంతో ట్రాఫిక్ జామైంది. నువ్వుగానీ బైకులో వెళ్ళి ఉంటే వ్యాన్ మృత్యుదేవత లెక్క ప్రకారం నువ్వు ప్రమాదాన్ని ఎదుర్కొని మరణించేవాడివి.
నేను : విస్తుపోయాను.
దేవుడు : మధ్యాహ్నం లంచ్ సమయంలోనూ నువ్వు తినాలనుకున్న మీల్స్ లో ఎలుక పడింది. దాన్నెవరూ గుర్తించలేదు నువ్వెళ్ళేసమయానికి అది గుర్తించి కింద పారబోశారు. నువ్వు ఆలస్యంగా వెళ్ళడంవల్ల ఆ ముప్పూ తప్పింది
ఆ మాటలతో నా కళ్ళు తడిశాయి.
దేవుడు : సాయంత్రం నీ ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అందుకు కారణం...నీకు ఫోన్ చేసిన వ్యక్తి తప్పుడు హామీలతో నిన్ను చిక్కుల్లో పడేయాలనుకున్నాడు. కనుక అందులోంచి నిన్ను కాపాడటానికి ఫోన్ ఆఫ్ అయ్యేలా చేశాను.
నేను అమ్మయ్య అనుకున్నాను.
దేవుడు : ఆ తర్వాత ఆ ఏసీ మిషన్ రిపేర్ అవడానికి కారణమూ ఆ లైన్ కరెంట్ పని చేయలేదు... నువ్వు మొహం కడుక్కుని చెయ్యి సరిగ్గా తుడుచుకోకుండా తడి చేత్తో స్విచ్ ఆన్ చేసుంటే నువ్వు షాక్కి గురై పడిపోయుండేవాడివి. కనుక అంతకన్నాముందే ఆ లైన్ పని చేయకుండా చేశాను.
నన్ను ప్రార్థించడం మరచిన నువ్వు రోజంతా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నావు. కానీ వాటన్నింటికీ కారణం నేనేనని అనుకుని నన్ను తిడుతున్నావు. రోజూ నువ్వు నన్ను ప్రార్థించావు. కానీ ఈరోజు నువ్వు నన్ను మరచినా నిన్ను నేను మరవలేదు.
నేను : నన్నెన్ని ప్రమాదాల నించీ ఎంతలా కాపాడావో........అంతా బాగానే ఉంది. నీకు కృతజ్ఞతలే. మరి నా పెళ్ళిరోజున ఎందుకు అడ్డంపడి నన్ను కాపాడకుండా ఎక్కడికి పోయావు? 😏😔😝
(గమనిక : ఇది తమిళానికి స్వేచ్ఛానువాదం. రచయిత పేరు లేకుండా నాకొక తమిళ మిత్రుడు వాట్సప్ లో పంపారు)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి