అంధులకు కొత్తవెలుగు ఇచ్చే పాఠశాల
 అంధులకు కూడా విద్యనందిచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కరీంనగర్ జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా అంధుల ఆశ్రమ పాఠశాలను స్థాపించింది.ఈ పాఠశాలలో 1 నుండి10వ తరగతి వరకు ఉచితంగా విద్య & భోజన వసతి అందించబడును.  విద్యతో పాటు ప్రత్యేక software తో రూపొందించిన  కంప్యూటర్ శిక్షణ & వివిధ కళల్లో శిక్షణ అందించబడును. ఈ పాఠశాలలో చేరుటకు 6 నుండి14 సం.ల మధ్య వయస్సు కలిగి ఉండి, జిల్లా మెడికల్ బోర్డుచే జారీ చేయబడిన సదరం సర్టిఫికెట్ 40% నుండి 100% అంధత్వం కలిగిన బాలబాలికలు అర్హులు.   కావున కరీంనగర్ & ఇతర జిల్లాలకు చెందిన అంధ బాలబాలికలను వారి తల్లిదండ్రులు, ఆ గ్రామాల్లోని ఉపాద్యాయులు, సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు & స్వచ్ఛంద   సంస్థలు కరీంనగర్ లోని అంధుల ఆశ్రమ పాఠశాలలో చేర్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేయుచున్నాము. 
ఇట్లు,
ప్రిన్సిపాల్ & సిబ్బంది, 
ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల, కరీంనగర్.
Ph. No:- 9494317315, 9701190124, 7396206959, 9440338424
కామెంట్‌లు