గూడు ....!!:- -- డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హన్మకొండ .

 మనిషికి 
కూడూ -గూడూ 
అవసరం అయినట్టే 
పశువులకీ -పక్షులకీ 
గూడూ -నీడా అవసరమే !
ఆహారం స్వయం శక్తితో 
సంపాదించే పక్షులు 
నీడకోసం -
గూడుకట్టుకోడం చూశారా ?
మనిషికి అంతుపట్టని 
నిర్మాణ కౌశలం 
పిచ్చుకగూడు చూడండి 
అర్ధమవుతుంది ...!!
    
కామెంట్‌లు