రాతి పూలు (-బాల గేయం)--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
రాళ్ళమాటున దాగిన విత్తు 
చక్కగా మొక్కై ఎదిగింది 
గాలిలోనిదే తేమను లాగి 
ముచ్చట పూలు పూసింది!

చిటికెడు మట్టి చిత్రం గానే 
మొక్కకు పోషణ నిచ్చింది 
గుండ్రంని రాళ్లే పుట్టినిల్లుగా 
మొక్కను అక్కున చేర్చాయి!

కఠినపు మాట మనిషికి ఉన్నా 
కరుణ లోపల దాగి ఉండును 
అవసరమైన సమయం లోనే 
ఆపన్న హస్తం తానే యగును!


కామెంట్‌లు