పుట్టిన బిడ్డ మూడో ఏటి కల్లా తన మాతృభాషను తప్పులు లేకుండా మాట్లాడగలదని నిపుణులు చెప్పినట్లు
ఎక్కడో ఎప్పుడో చదివాను.
కానీ మాట అనేది అంత తేలికైనది కాదు.
జీవితాంతమూ ఎవరితో ఎలా మాట్లాడాలో
తెలీని వారెవరైనా ఉన్నారా అంటే ఉన్నారనడానికి నేనే ఓ ఉదాహరణ.
మాట శక్తి అసామాన్యం.
మాట ఒకరికి ధైర్యమిస్తుంది.
మాట ఒకరికి భరోసా ఇస్తుంది.
మాట ఒకరిని బలహీనపరుస్తుంది.
మాట ఒకరిని బలాన్నిస్తుంది.
మాట్లాడటం ఎలాగైనా వచ్చేస్తుంది. నాన్నేమోకానీ అమ్మ వల్ల, తోబుట్టువుల వల్ల మాటలు వచ్చెస్తాయి. మాట్లాడేస్తుంటాం. కానీ మాటల వాడుక, వాడుక మాటలు తెలుసుకుని సమయసందర్భాలనుబట్టి మాటలు ప్రయోగించడం తెలిస్తే అంతకన్నా విశేషమేముంటుంది.
ఇప్పటికీ నన్ను మా ఆవిడ అప్పుడప్పుడూ అంటూ ఉంటుంది...."ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదని". తను అలా అన్నప్పుడు కోపమొచ్చి గొణుగితే దానికీ మరో విమర్శ చేస్తుంది. గొణక్కు. చెప్పేదేదో స్పష్టంగా చెప్పమని.
నిజమే, నాకు మాట్లాడటం రాదు. మాటలొచ్చు. రాకేం. కానీ ఎలా మాట్లాడాలో తెలీదు. పైగా మాట తొందరొకటి. రాకెట్ స్పీడుని మించి మాట్లాడటం నాకో లోపం. అవతలివారికి అర్థమవుతుందో లేదో ఆలోచించక మాట్లాడేస్తుంటాను. నేనన్ని మాట్లాడేసాక మా అత్తగారు "ఇంతకీ ఏమన్నాడే" అని మా ఆవిడను అడిగేవారు.
కొందరు మాట్లాడటం చూస్తే బలే ముచ్చటేస్తుంది. అరటిపండొలిచినట్లు అనే మాటకన్నా పనసతొనలు తినిపిస్తున్నంత మధురంగా ఉంటాయి వారి మాటలు అంటే అతిశయోక్తికాదు.
ఒకరిని నొప్పించక మాట్లాడటం ఓ కళ.
ఒకరిని ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ.
ఒకరి తప్పుని తెలియచేసేలా సున్నితంగా మాట్లాడటమూ ఓ కళ.
ఒక్క మాట మీద ఎన్నయినా రాసుకుంటూ పోవచ్చు. అందుకు కారణం, నాకిప్పటికీ సరిగ్గా మాట్లాడటం తెలియకపోవడమే అని రూఢీగా చెప్పగలను.
మా నాన్నగారు సభలలో మాట్లాడటం ప్రత్యక్షంగా చూసాను. విన్నాను. మా మావగారు మాట్లాడటమూ విన్నానూ! కన్నానూ!!
కానీ నాకు వారిలో ఒక్క శాతమన్నా రాలేదు మాట్లాడటం. వేగంగా మాట్లాడటంలో నాకు మా మేనమామ పోలికొచ్చిందంటారు. అదెంత వరకు నిజమో తెలీదు కానీ నా మాట వేగమేనని నాకు తెలుస్తూనే ఉంటుంది. కానీ ఏమీ చేయలేని స్థితి. మద్రాసు ఆలిండియా రేడియోలో కొంత కాలం మాట్లాడే అవకాశం వచ్చింది. కానీ "పది నిముషాల టాక్" ని రికార్డింగ్ సమయంలో అయిదు నిముషాల్లో చదివేసరికి ప్రోగ్రాం ఇన్ ఛార్జ్ లలితగారు "మీరు స్క్రిప్ట్ రాసివ్వండి చాలు. గజగౌరి చదువుతారు" అని సూచించారు.
ఎంత నెమ్మదిగా మాట్లాడాలనుకున్నా నాకు చేతకావడంలేదు. ఐనా ఇప్పుడేమొస్తుంది మాట్లాడటం. అరవై ఏడేళ్ళు మాట్లాడటం తెలీకుండానే నెట్టేసాను ఎంచక్కా. నా మాటలు అర్థం చేసుకున్న వారికీ అర్థంకాని వారికీ అందరికీ కృతజ్ఞతలే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి