చిన్ని కృష్ణ చూడరా
అమ్మ లాల పోయురా
ఊయలేసి ఊపుతూ
జోల పాట పాడురా
అమ్మ పాట వింటావా
నిద్ర నీవు పోతావా
నిద్ర లేసినాక కృష్ణా
వెన్నంతా తింటావా
వెన్న దొంగ వంటారు
మన్ను తిన్నా వంటారు
నోరు చూపుతుంటారు
చూసి మూర్ఛ పోతారు
ఎన్ని లీలలు కన్నయ్య
కొంటె పనులతొ కిట్టయ్య
కొమ్మ మీద దాగినావయ్య
కోకలనే దాసి పెట్టినావయ్య
గోపికల నేమో పిలిచావు
గోల గోల చేసావు నీవయ్య
ఆటపాటలతో కన్నయ్యా
వారి మనసులనే దోచావు
అమ్మ కళ్ళు గప్పావు
అడవి బాట పట్టినావు
రాక్షసులను చంపినావు
తిరిగి ఇంటికొచ్చినావు
ఎంత మంచి వాడవయ్య
మురళినూది పాడవయ్య
మురళి పాటను వినిపించి
మాకు ముక్తినివ్వు కృష్ణయ్యా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి