అందరూ పల్లకీలెక్కేవారే
మోసేది ఎవరు?
అందరూ వ్రాసేవాళ్ళే
చదివేవారెవరు?
అందరూ చెప్పేవాళ్ళే
వినేవారెవరు?
అందరూ పాడేవారే
ఆలకించేవారెవరు?
అందరూ ఆరగించేవారే
వండేవారెవరు?
అందరూ దళారులే
ఉత్పత్తి చేసేదెవరు
అందరూ నీతులు చెప్పేవారే
ఆచరించేది ఎవరు?
అందరందరూ నటించేవారే
చూసేది ఏవరు?
అందరూ మొసగించేవారే
మోసపోయేది ఓటర్లే
ముమ్మాటికీ ఓటర్లే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి