వికాసం ఆకాశం ఒక్కటే
మనం కాలం ఒక అవకాశం మాత్రమే!?
మన దారి రహదారి కాదు
విజ్ఞానమే అందరి దారి అవుతుంది!?
బ్రాహ్మణపిల్లి బ్రాహ్మణపులీ బ్రాహ్మణ సింహం అని ఉండదు
ఆకలైతే అన్నీ మాంసాన్ని తింటాయి!?
అట్లే మనిషి బ్రాహ్మణుడు క్షత్రియుడు శూద్రుడు అని ఉండడు
అవసరము వచ్చినప్పుడు ఆ మనిషిలోని రాక్షసుడు బయటపడతాడు!?
దేవుణ్ణి ఆత్మను జన్మలను కనిపెట్టిన మనిషి
వైజ్ఞానిక శాస్త్రాన్ని కూడా కనిపెట్టి దర్జాగా భూమిపై బతుకుతున్నాడు!?
ఔషధ మొక్కలు సుగంధ ద్రవ్యాలు పండ్లు పంటల నిచ్చే మొక్కలు కోట్లను సంపాదిస్తున్నాయి!?
కానీ వాటికి వ్యాపారం చేయడం రాదు!?
వైజ్ఞానిక సూత్రాలకు కూడా వ్యాపారం చేయటం రాదు కానీ ప్రపంచం దాన్ని సొమ్ము చేసుకుంటుంది!?
వాటి విలువ వాటికే తెలియదు
మనిషి విలువ మనిషికి తెలియదు
మనిషి అంటే పని మనిషి కాదు!?
ఆ పనితో దనం అధికారం కీర్తి మాత్రమే కాదు
మనిషి ఒక అద్భుతం
అద్భుతాలను సృష్టించడమే మనిషి పని!?
Pratapkoutilya
8309529273
16/03/2021
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి