తోటలో ఆటలు :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

బాలలూ రండిరా హాయిగా ఆడుదాం 
తోటలో తిరుగుతూ అల్లరే చేద్దాం 

పార్కులో ఊయలే స్వాగతం పలికెను 
ఒంగుడూ దుముకుడూ ఒంటికే సరిపడూ 

పచ్చికే మెరిసెనే మంచులో ముత్యమై 
మచ్చికే చేయుదమ్ పండుతో ఉడుతనీ 

చిలకలూ వాలాయి జామచెట్టు 
కొమ్మపై 
సవ్వడే చేయకూ అందమే దృశ్యమూ 

పుస్తకం తెచ్చుకో ఆలోచన పెంచుకో 
మూలగా కూర్చుని చక్కగా చదువుకో 

టీవీలు సెల్ఫోను కొన్నిటికి వాడుకో 
మాస్కుతో తిరగడం ప్రస్తుతం మంచిది 

ఇంటిలో భోజనం జంటగా చెల్లితో 
తినుటకే ముందుగా చేతులే కడుగుదాం !!

కామెంట్‌లు