చెరువు (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి
చెరువమ్మా చెరువు
మా ఊరి చెరువు
అందమైన చెరువు
పంట చేళ్ళకు నిలయం

చెరువు లోన తామరలు
చెరువంచుకు దుంపలు
కప్పల చేపల ఇల్లతో
కల కల లాడే మా చెరువు

కొంగలు చేసే వేటలతో
హంసలు ఆడే ఆటలతో
బాతులు ఈదే ఈతలతో
తొలికిసలాడే మా చెరువు

తుంగ దుంపల పూలతో
బుడు బుంగల గూల్లతో
నిండు కుండలా ఆ చెరువు
మా అందరికీ బ్రతుకు దెరువు

కామెంట్‌లు