గాలిలో ఎగరలేను...:- వనజ . సి.

 అరగంట వాదిస్తాడు గాని ఐదు నిమిషాలు కూర్చుని రాయడానికి చుక్కలు చూపిస్తాడు విభాత. ఇంతకు ముందోసారి చెప్పినట్లు cruelty అంటాడు,  bail  అంటాడు, constitution అంటాడు. గూగుల్ చేసి పిల్లల్ని ఫోర్స్ చెయ్యటం తప్పని రకరకాల ఎగ్జాంపుల్స్ చూపిస్తాడు. కానీ కూర్చుని మాత్రం రాయడు.
స్కూలు వాళ్లు ప్రతిబుధవారం వర్క్ పంపుతారు. నాలుగు వారాల వర్క్ నెలకోసారి సబ్మిట్ చెయ్యాలి. రోజూ గంట స్కూలు వర్క్ చెయ్యాలన్నది వాళ్ళలెక్క. చేస్తే అరగంటే. కానీ ఆదివారం దాకా ఏదోరకంగా గడిపేసి చివరి మూడురోజులు అనేక వాదనలు యుద్దాల మధ్య ఎలాగో చేస్తాడు. అయినా అందులో ఎవో కొన్ని మిగిలిపోతాయి. ఇక సబ్మిషన్ వారంలో చూడాలి.  బతిమిలాటలు, బెదిరింపులు, ఏడుపులు... 
రోజుకొక వర్క్ బదులుగా రెండో, మూడో చేసినా సబ్మిషన్ ముందురోజుకు 4 వర్క్ లు మిగిలిపోయాయి. కూర్చుంటే రెండుగంటల పని. చెయ్యొచ్చుగదా అని బతిమిలాడితే "నడుస్తున్నా కదా అని పరుగెత్తమన్నావు, పరిగెత్తుతున్నా కదా అని గాలిలో ఎగరమంటున్నవు. కుదరదమ్మా"  అట 
కామెంట్‌లు