అక్షరమాలికలు:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
ఏకపది:(మెట్టెలు)
*******
1.పెళ్ళయిన స్త్రీల_సౌభాగ్య చిహ్నాలు.
2.కాలి వేళ్ళకు తొడగబడిన_సంప్రదాయ సూచికలు.

ద్విపదం:(పాదము)
********
1.కొత్త ఆరంభానికి నాంది పలికే   అడుగు.
సప్తపదిలో కలిసి నడిచే ప్రయాణానికి ఆదరవు.
2.జీవితంలో నడక సాగించేందుకు తోడ్పడేది.
సుదూర తీరానికి వెళ్ళడానికి ఆధారం.

త్రిపదం:(పారాణి)
*******
1.మంగళకరమైన‌ అలంకారమై 
మది దోస్తుంది.
వర్ణమయమైన జీవితారంభానికి సంకేతమవుతుంది.
మగువ మనసుల అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది.
2.వధూవరుల ఆకాంక్షల సుస్వాగతమై నిలుస్తుంది.
కొత్తపెళ్ళికూతురు నేస్తమై వెంటవస్తుంది.
కాళ్ళకు శోభాయమానమై విరాజిల్లుతుంది.

చతుర్థపదం:(పసుపు)
**********
1.అమ్మవారి స్వరూపమై అలరారుతుంది.
సుగంధద్రవ్యమై అందానికి ఆధారమవుతుంది.
వంటింటి సంభారమై ఆరోగ్యాన్నిస్తుంది.
కాలికి రాయబడిన సౌభాగ్యచిహ్నమవుతుంది.
2.ఆయుర్వేదంలో ఔషధమై పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే అమృతమవుతుంది.
పూజల్లో పునీతమైన పూజాద్రవ్యమవుతుంది.
స్త్రీల అందానికి వన్నె తెచ్చే సౌందర్య సాధనమవుతుంది.

కామెంట్‌లు