ఓషో తన బాల్యం గురించి రాసుకున్న పుస్తకం చదవడం మొదలుపెట్టాను. అందులో ఓచోట ఆయన చెప్పిన విషయం....
"మా బామ్మ ఒడ్డూ పొడవూ ఎక్కువే. బలవంతురాలు. పైగా సుందరాంగి. మరోవైపు మా తాతయ్య పొట్టి. అచ్చం ఓ గృహస్తుడిలా ఉంటాడు. అయినా బామ్మ, తాతయ్యల మధ్య సంసారం హాయిగా సాగిపోయింది. తాతయ్య బామ్మ గొడవపడటం ఎప్పుడూ చూడలేదు. అయినా ఆయనసలు గొడవ పడే అవకాశం ఇచ్చేవారు కాదు. కనుక వారి మధ్య ఘర్షణ అనే దానికి ఆస్కారమే లేదు...."
ఇలాంటివి చదువుతున్నప్పుడు నాకనిపించేది ఒక్కటే. భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఎట్టి పరిస్థితిలోనూ చివరికి విజయం భార్యనే వరిస్తుంది. నాకు తెలిసి భర్త ఆధిపత్యమంతా కాస్సేపే.నా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మాట చెప్పాలనిపించింది.
నాకు కోపం కాస్త ఎక్కువే. ఏదున్నా లేకపోయినా కోపాన్ని మాత్రం ఒకింత ఎక్కువే పెట్టి పుట్టించాడు దేవుడు. అందుకేనేమో నేననుకున్నట్లు ఏదైనా జరగలేదంటే వెంటనే చొచ్చుకైస్తుంది. పెళ్ళయిన కొత్తలో కొంత కాలం సర్దుకుందేమో కానీ పోను పోను నా కోపాన్నసలు లెక్క చేయడమే మానేసింది మా ఆవిడ. పెళ్ళయి ముప్పై ఎనిమిదేళ్ళయింది. ఇప్పుడైతే నా కోపాన్ని లెక్కలోకే తీసుకోవడం మానేసింది. కనుక నేనే కోపాన్ని నియంత్రించుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే నా కోపానికి మర్యాదనేదే లేకుండా పోయింది. ఇందుకు కారణం చీటికీమాటికీ కోప్పడటం వల్ల దమ్మిడీ ప్రయోజనం లేదన్నది మా ఆవిడ వల్ల తెలుసుకున్న నిజం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి