అమరావతి నగరంలోని విశ్రాంత అటవీశాఖ అధికారి రాఘవయ్య తాత ఇంటి అరుగుపై ఆవాడకట్టులోని పిల్లలు కథవినడానికి అందరు చేరారు.
పిల్లలుఅందరికి మిఠాయిలు పంచినతాతయ్య'బాలలు ఈరోజు మీకు రాతియుగ మనిషి తొలిసారి ఇల్లు ఎలానిర్మించాడో తెలిపే విషయం కథారూపంలో చెపుతాను.పూర్వంమనిషి రక్షణ పొందడానికి కొండగుహలలోనూ,చెట్లపైన నివసించేవాడు.ఒకరోజు ఇద్దరు మనుషులు ఒక జింకను తరుముతూ తమ నివాసంనుండి అడవిలో చాలాదూరం వెళ్ళారు.అప్పుడు ఓక్కసారిగా వాతావరణం మారిపోయింది.చీకట్లు కమ్ముకున్నాయి.ఉరుములు మెరుపులతొ పెద్ద వర్షం కురవసాగింది.ఆ అడవిమనుషులు వర్షంలో తడవకుండా ఉండటానికి ఏదైనా స్ధలం దొరుకుతుందేమోనని వెదుకుతూ,రెండుచెట్లమధ్య గుడారంలా ఉన్న ప్రదెశాన్ని చూసి అక్కడకి చేరుకుని తలదాచుకున్నారు.కొంతసేపటికి వర్షం తగ్గి వెలుతురు వచ్చింది.తాము వర్షంలో తడవకుండా తలదాచుకున్నది పెద్ద ఏనుగు కళేబరం అనితెలుసుకుని ఆశ్చర్యపోయారు.అనారోగ్యంతో ఏనుగు రెండుచెట్లమద్యకు చెరి ఓచెట్టు పంగలకర్రలో (కొమ్మరెండుగాచీలిన)తలపెట్టి ప్రాణాలు వదిలింది.కొద్దిరోజులలో దాని పొట్టలోని మాంసాన్ని కౄరమృగాలు తినివేయండంలొ అది డొల్లగా మారి గుడారంలా అయింది.నాలుగుకాళ్ళపై స్ధిరంగా నిలబడి తల చెట్టులో ఉంచినందువలన ఆ ఏనుగు పడిపోకుండా అలానే నిలబడిఉంది.అది మనుషులకు గుడారంలా వర్షంలో తడవకుండా కాపాడింది.ఆపక్కనే ఉన్న చెట్టుకు వర్షంలో తడవకుండా పిట్ట నిర్మించుకున్న గూడును చూసిన అడవిమనుషులు,నీరు పారుతున్న ప్రదేశానికిచేరి,నాలుగు చెట్టు మెదళ్ళు తెచ్చి చదునైన ప్రదేశంలోఏనుగు కాళ్ళలా నాటి,ఏనుగు పక్కటెముకలు ఎలాఉన్నవో,అలానే చెట్టుకొమ్మలు వేసి అడవి తీగలు తొగట్టిగా కట్టి పెద్దపెద్దఆకులతొ ఆఇంటిపైభాగాన్ని పూర్తిగా కప్పివేసారు.ఆఇంటికి చుట్టు బలంగా కర్రలు నాటి గోడలా చేసారు.ఒక పక్క తలుపులా పెట్టుకుని రాత్రులు జంతువుల దాడినుండి రక్షణ పొందారు.అలా మనిషి తన తొలిఇల్లు నిర్మించుకున్నాడు.దానికి ఏనుగు కళేబరమే స్తూర్తి కలిగించింది.అలా ప్రారంభమైన ఇంటి నిర్మాణం నేడు ఏన్నో విధాల అభివృధ్ధి చెందింది'అన్నాడు రాఘవయ్య తాత.సంతోషంగా చప్పట్లు కొట్టారు బాలలు అందరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి